UIDAI: రెండున్నర కోట్ల ఆధార్ నంబర్లు డీయాక్టివేట్!
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ డేటాబేస్ను ప్రక్షాళన చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు మరణించిన వ్యక్తులకు చెందిన సుమారు 2.5 కోట్ల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ (రద్దు) చేసినట్లు ప్రకటించింది. డేటాబేస్ను కచ్చితంగా, విశ్వసనీయంగా ఉంచేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ వ్యవస్థ అయిన ఆధార్లో (UIDAI) ప్రస్తుతం 134 కోట్ల మంది యాక్టివ్ వినియోగదారులు ఉన్నారు. అయితే వ్యక్తులు మరణించిన తర్వాత కూడా వారి ఆధార్ నంబర్లను ఉపయోగించి పెన్షన్లు, రేషన్ వంటి ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలను అక్రమంగా పొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి గుర్తింపు మోసాలకు (Identity Fraud) అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ నంబర్లను తొలగించినట్లు (UIDAI) తెలిపింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గతేడాది నవంబర్లో కూడా యూఐడీఏఐ (UIDAI) 2 కోట్ల నంబర్లను రద్దు చేసింది. ఈ ప్రక్రియ కోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI), రాష్ట్ర ప్రభుత్వాల జనన-మరణ రికార్డులు, ప్రజా పంపిణీ వ్యవస్థల నుండి డేటాను సేకరించారు. భవిష్యత్తులో మరణ ధృవీకరణ కోసం బ్యాంకులు, ఇతర సంస్థలతో కలిసి పనిచేసే యోచనలో కూడా (UIDAI) సంస్థ ఉంది.






