శాంసంగ్ ఫోన్ నుంచి ఐ ఫోన్లకు వీడియోలు పంపడం ఈజీ… ఎయిర్ డ్రాప్ ఫీచర్ అందుబాటులోకి
శాంసంగ్ ఫోన్ల నుంచి ఐ ఫోన్లకు వీడియోలు, ఫొటోలు పంపలేక పోతున్నారు కదా. ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టింది శాంసంగ్. తన ఎస్ 26 సిరీస్ లో యాపిల్ ఫోన్ల తరహా ఎయిర్ డ్రాప్ ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని సాయంతో ఫోటోలను, వీడియోలను ఐ ఫోన్లకు సులువుగా షేర్ చేయవచ్చు.
– శాంసంగ్ ఎస్ 26 ఫోన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి, కనెక్టెడ్ డివైజ్ ను ఎంపిక చేయాలి.
– క్విక్ షేర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
– షేర్ విత్ యాపిల్ డివైజ్ ను క్లిక్ చేసి ఆన్ చేయాలి.
– ఐ ఫోన్ లోనూ ఎయిర్ డ్రాప్ ఆప్షన్ ను ఎనేబుల్ చేయాలి.
– షేర్ చేయాల్సిన ఫైల్ ను సెలెక్ట్ చేసి, క్విక్ షేర్ ద్వారా లిస్టులో కావాల్సిన ఐ ఫోన్ డివైజ్ ను ఎంపిక చేసుకోవాలి.
అయితే ఈ ఫీచర్ ను దక్షిణ కొరియాలోని ఎస్ 26 యూజర్లకు అందుబాటులోకి తెచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో అందరికీ వచ్చేస్తుంది. ఇలాంటి ఫీచర్ నే 2025 లో గూగుల్ తన పిక్సెల్ డివైజ్ లో తీసుకొచ్చింది.








