LPG: ఎల్పీజీ సిలిండర్ బరువు తగ్గింపు అనేది పూర్తి అబద్ధం : కేంద్రం క్లారిటీ
ఎల్పీజీ (LPG)సిలెండర్ బరువును 14.2 కిలోల నుంచి 10 కిలోలకు తగ్గిస్తున్నారంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వినియోగదారులకు ఒకటే టెన్షన్ పట్టుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అవన్నీఒఠ్ఠి వార్తలేనని కొట్టిపారేసింది. ఈ విషయాన్ని పెట్రోలియం మంత్రిత్ద శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ప్రకటించారు. అలాంటి వార్తలేమీ లేవని తేల్చి చెప్పారు. ఇరాన్, అమెరికా వార్ నేపథ్యంలో వంట గ్యాస్ కొరత తీవ్రమైంది. దీనిని అధిగమించేందుకు చమురు సంస్థలు సిలిండర్ బరువును తగ్గించే యోచనలో వున్నట్లు వార్తలొచ్చాయి. గృహ అవసరాలకు 10 కేజీల ఎల్పీజీ సిలెండర్లను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు కూడా వేస్తున్నట్లు వార్తలొచ్చాయి.
ప్రస్తుతం గృహ అవసరాల కోసం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. దీనిని 10 కిలోలకు తగ్గించాలని, పాత సిలిండర్లలోనే 10 కేజీల ఎల్పీజీని నింపి, అందించే ప్రయత్నాలు చేస్తారని అన్నారు. గృహ అవసరాలకు కొరత రాకుండా వుండేందుకే ఈ నిర్ణయం అని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోలియం మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి








