డెలివరీ భాగస్వాములపై మానవత్వం.. ఇండస్ఇండ్ జనరల్ ఇన్సూరెన్స్ ‘ఏక్ గ్లాస్ పానీ’ సరికొత్త ప్రచారం!
హైదరాబాద్: తీవ్రమైన ఎండలను, ట్రాఫిక్‌ను సైతం లెక్కచేయకుండా మన దైనందిన అవసరాలను తీర్చడం కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్న గిగ్ వర్కర్లు డెలివరీ భాగస్వాముల పట్ల ప్రతి ఒక్కరూ సానుభూతిని, మానవత్వాన్ని ప్రదర్శించేలా ప్రోత్సహించడానికి ఇండస్ఇండ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (గతంలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్) ఒక అద్భుతమైన సామాజిక ప్రచార కార్యక్రమాన్ని (సోషల్-ఫస్ట్ క్యాంపెయిన్) ప్రారంభించింది. ‘ఫార్వర్డ్ టుగెదర్ స్టార్ట్స్ విత్ జస్ట్ ఏక్ గ్లాస్ పానీ’ (ఒక గ్లాసు నీటితో కలిసి ముందుకు సాగుదాం) అనే నినాదంతో రూపొందించిన ఈ ప్రత్యేక ప్రచారం, సమాజంలో డెలివరీ సిబ్బంది ఎదుర్కొంటున్న கష్టాలను గుర్తించి, వారి పట్ల చిన్నపాటి సాయాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతుం భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కామర్స్ డెలివరీ రంగానికి కోట్ల మంది డెలివరీ సిబ్బంది ప్రధాన వెన్నెముకగా నిలుస్తున్నారు. సాంకేతికత ఆధునిక వసతులు వినియోగదారులకు వస్తువులను పొందే విధానాన్ని పూర్తిగా మార్చేసినప్పటికీ, ఈ సేవలను మన ఇంటి ముంగిటకు చేరవేస్తున్న డెలివరీ భాగస్వాముల శ్రమ చాలా మటుకు గుర్తింపునకు నోచుకోవడం లేదు. అందుకే, ప్రతి డోర్‌స్టెప్ డెలివరీ వెనుక ఉన్న మానవీయ కోణాన్ని వారి నిజ జీవిత కథలను సమాజం దృష్టికి తీసుకెళ్లాలనేది ఈ క్యాంపెయిన్ ముఖ్య ప్రయత్నం.
బ్రాండ్ సిద్ధాంతానికి ప్రాణం పోసిన ‘సోచీర్స్’
ఈ సరికొత్త డిజిటల్ ప్రచార కార్యక్రమాన్ని ఇండస్ఇండ్ జనరల్ ఇన్సూరెన్స్ సోషల్ మీడియా ఏజెన్సీ పార్ట్నర్ ‘సోచీర్స్’ (Socheers) ఎంతో సృజనాత్మకంగా రూపొందించి, అమలు చేసింది. నిత్య జీవితంలోని సాధారణ మానవ నైజం ఆధారంగా, డెలివరీ భాగస్వాములు ఎదుర్కొంటున్న మనం తరచుగా నిర్లక్ష్యం చేసే అనుభవాలను ఒక చక్కటి కథనం ద్వారా ఈ ప్రచారంలో పొందుపరిచారు.
ఇవి కూడా చదవండి
ఆలోచింపజేసే ఒక షార్ట్ ఫిల్మ్, క్రియేటివ్ సోషల్ మీడియా పోస్టుల ద్వారా, సమాజంలో మనం చూపే చిన్నపాటి ఆదరణ ఎలాంటి పెద్ద మార్పును తీసుకురాగలదో చూపిస్తూ, బ్రాండ్ ‘ఫార్వర్డ్ టుగెదర్’ (కలిసి ముందుకు) అనే ఉమ్మడి సిద్ధాంతానికి ‘సోచీర్స్’ ప్రాణం పోసింది.
నిజమైన పురోగతిపై బ్రాండ్ నమ్మకం:
ఇండస్ఇండ్ జనరల్ ఇన్సూరెన్స్ విస్తృత ‘ఫార్వర్డ్ టుగెదర్’ ఆలోచనా విధానంలో భాగంగా ఈ ప్రచారం రూపొందించబడింది. కేవలం బిజినెస్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ ద్వారానే కాకుండా, సానుభూతి, పరస్పర అవగాహన ఉమ్మడి సామాజిక బాధ్యత ద్వారా మాత్రమే సమాజంలో నిజమైన పురోగతి సాధ్యమవుతుందనే బ్రాండ్ నమ్మకాన్ని ఈ చొరవ ప్రతిబింబిస్తోంది.
ఒక గ్లాసు నీటితోనే మార్పు మొదలు: తరుణ్ ఖన్నా
ఈ కార్యక్రమం గురించి ఇండస్ఇండ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రెసిడెంట్ & హెడ్ (డిజిటల్ బిజినెస్, మార్కెటింగ్ & స్ట్రాటజీ) తరుణ్ ఖన్నా మాట్లాడుతూ, “తీవ్రమైన ఎండలు, ట్రాఫిక్ లేదా సుదీర్ఘ పని వేళలతో సంబంధం లేకుండా గిగ్ వర్కర్లు ప్రతిరోజూ మన కోసం శ్రమిస్తున్నారు. అయినప్పటికీ, ప్రతి డెలివరీ వెనుక ఉన్న వారి శ్రమను గుర్తించడానికి మనం పెద్దగా సమయం కేటాయించం. ‘ఏక్ గ్లాస్ పానీ’ ద్వారా, మనం మానవత్వంతో చేసే అతి చిన్న పని లేదా సాయం కూడా అవతలి వ్యక్తిలో తమకు గుర్తింపు లభిస్తోందనే భావనను, గౌరవాన్ని కలిగిస్తుందని గుర్తుచేయాలనుకున్నాము. మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే వ్యక్తులను గుర్తించడం మన రోజువారీ సంభాషణలలో సానుభూతి ఒక భాగమయ్యే సంస్కృతిని సృష్టించడంతోనే ‘కలిసి ముందుకు సాగడం’ ప్రారంభమవుతుందని ఇండస్ఇండ్ జనరల్ ఇన్సూరెన్స్ విశ్వసిస్తుంది” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా కేవలం వ్యాపార లావాదేవీలకే పరిమితం కాకుండా, ప్రజల ప్రవర్తనలో సానుకూల మార్పులను తీసుకురావాలని బ్రాండ్ ఆశిస్తోంది. మన ఇంటికి వచ్చే డెలివరీ బాయ్స్‌కు ఒక గ్లాసు మంచి నీరు ఇవ్వడం వంటి సాధారణ అలవాటును ప్రోత్సహించడం ద్వారా గిగ్ వర్కర్ల పట్ల గౌరవాన్ని పెంచాలని, రోజువారీ జీవితంలో మానవత్వం ప్రాముఖ్యతపై చర్చను రేకెత్తించాలని ఈ ప్రచారం లక్ష్యంగా పెట్టుకుంది.








