ఆసియా ‘నెం.1’ కుబేరుడిగా గౌతమ్ అదానీ.. అంబానీ రికార్డు బ్రేక్!
Gautam Adani:ఆసియాలోనే అత్యంత ధనవంతుడెవరు అనే విషయంలో మరోసారి కీలక మార్పు చోటుచేసుకుంది. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించి ఆసియాలోనే నంబర్ 1 సంపన్నుడిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించిన తాజా లెక్కల ప్రకారం, అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో ఆయన సంపద అమాంతం పెరిగింది.
ఇవి కూడా చదవండి
అదానీ 19వ స్థానంలో..
ప్రస్తుతం గౌతమ్ అదానీ నికర ఆస్తి విలువ 92.6 బిలియన్ డాలర్లు కాగా, ముకేశ్ అంబానీ సంపద 90.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ 19వ స్థానంలో, అంబానీ 20వ స్థానంలో కొనసాగుతున్నారు. అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పోర్ట్స్ వంటి కంపెనీల స్టాక్స్ మార్కెట్లో లాభాల్లో ఉండటమే ఈ మార్పుకు ప్రధాన కారణం.
ప్రపంచంలోనే ధనిక వ్యక్తిగా ఎలాన్ మస్క్..
అంతర్జాతీయ స్థాయిలో టెక్ దిగ్గజాల హవా కొనసాగుతోంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 656 బిలియన్ డాలర్ల అద్భుతమైన సంపదతో ప్రపంచంలోనే ధనిక వ్యక్తిగా తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నారు. టాప్-10 జాబితాలో ల్యారీ పేజ్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి ప్రముఖులు నిలిచారు.
భారతీయ బిలియనీర్లు:
బ్లూమ్‌బెర్గ్ సూచీలో అదానీ, అంబానీలతో పాటు భారత్ నుంచి మరికొందరు ప్రముఖులు కూడా చోటు దక్కించుకున్నారు.
- లక్ష్మీ మిత్తల్
- శివ్ నాడార్
- సావిత్రి జిందాల్
- రాధాకృష్ణ ధమానీ
- అజీమ్ ప్రేమ్‌జీ
వ్యాపార పనితీరు , స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల బట్టి ఈ ర్యాంకులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ప్రస్తుతం అదానీ గ్రూప్ దూకుడు ఆసియాలోనే ఆయన్ని అగ్రపీఠంపై కూర్చోబెట్టింది.
ఇవి కూడా చదవండి








