CSK Roar 2026: చెపాక్‌లో దద్దరిల్లిన ‘సీఎస్కే రోర్ 2026’.. ప్రత్యర్థి కోచ్‌లు ఎందుకొచ్చారంటే?
ఐపీఎల్ 19వ సీజన్ (IPL 2026) మహా సంగ్రామానికి ముందు చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియంలో పసుపు పండుగ వాతావరణం నెలకొంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ అభిమానుల కోసం ప్రత్యేకంగా ‘సీఎస్కే రోర్ 2026’ (CSK Roar 2026) అనే కార్యక్రమాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్తో పాటు, పాత-కొత్త ఆటగాళ్ల కలయిక ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పాత తరం దిగ్గజాల సందడి
ఒకప్పటి సీఎస్కే స్టార్లంతా ఒకే వేదికపైకి (CSK Roar 2026) రావడం అభిమానుల్లో పాత జ్ఞాపకాలను రేకెత్తించింది. మాథ్యూ హేడెన్, మైకేల్ హస్సీ, డ్వేన్ బ్రావో, ముత్తయ్య మురళీధరన్, మురళీ విజయ్, పార్థివ్ పటేల్, సురేశ్ రైనా, ఎస్. బద్రీనాథ్ వంటి మాజీ స్టార్లు మళ్లీ పసుపు జెర్సీలో చెపాక్ మైదానంలో అడుగుపెట్టారు. ఇక ఎప్పటిలాగే ఎంఎస్ ధోనీ (44 ఏళ్లు) ఎంట్రీ ఇవ్వగానే స్టేడియం దద్దరిల్లిపోయింది. తమ అభిమాన స్టార్‌ను చూసి ఒక అభిమాని భావోద్వేగంతో కన్నీరు పెట్టుకోవడం అందరినీ కట్టిపడేసింది. మిస్టర్ ఐపీఎల్ రైనాకు కూడా ఫ్యాన్స్ నుంచి ఘన స్వాగతం లభించింది.
ఇవి కూడా చదవండి
సంజూ శాంసన్‌కు గ్రాండ్ వెల్కమ్
రాజస్థాన్ రాయల్స్ నుంచి ఐపీఎల్ 2026 సీజన్‌కు సీఎస్కేలోకి (CSK Roar 2026) అడుగుపెట్టిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు చెన్నై ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. మైదానంలో సరదాగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధోనీ మళ్లీ కీపింగ్ గ్లౌజులు ధరించాడు. రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్‌లో హస్సీ, మురళీధరన్ బౌలింగ్‌లో శాంసన్ భారీ సిక్సర్లు బాదారు. ఒక దశలో క్రీజు దాటిన బ్రావోను ధోనీ కావాలనే స్టంపింగ్ చేయకుండా వదిలేయడం, అనంతరం బ్రావో పాట పాడుతూ వచ్చి ధోనీని హత్తుకోవడం వేడుకలో (CSK Roar 2026) హైలైట్‌గా నిలిచింది.
వరల్డ్ కప్ హీరోలకు సత్కారం..
భారత్‌కు టీ20 వరల్డ్ కప్ అందించిన సీఎస్కే (CSK Roar 2026) కరెంట్ ప్లేయర్లు సంజూ శాంసన్, శివమ్ దూబేలను ఈ వేదికపై ఎంఎస్ ధోనీ ప్రత్యేక మెమెంటోలతో ఘనంగా సత్కరించాడు. అలాగే ఇటీవల అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత యువ జట్టు కెప్టెన్ ఆయుష్ మాత్రేను కూడా ధోనీ అభినందించాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ప్రత్యర్థి జట్ల కోచ్‌లు ఎందుకొచ్చారంటే?
ఈ వేడుకలో (CSK Roar 2026) ఇతర ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కోచ్‌లుగా వ్యవహరిస్తున్న వారు కూడా పాల్గొనడం విశేషం. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్, గుజరాత్ టైటాన్స్ (GT) నూతన బ్యాటింగ్ కోచ్ మాథ్యూ హేడెన్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మెంటార్ డ్వేన్ బ్రావో ఈ వేడుకకు హాజరయ్యారు. ఒకప్పటి తమ మాజీ ఆటగాళ్లను ఈ ఒక్క రోజు వేడుక కోసం పంపాలని సీఎస్కే యాజమాన్యం ఆయా ఫ్రాంచైజీల (SRH, GT, KKR) నుంచి ప్రత్యేక అనుమతి (Approval) తీసుకోవడం వల్లే వీరంతా ప్రత్యర్థి జట్ల సిబ్బంది అయినప్పటికీ ఈ వేడుకలో (CSK Roar 2026) పాల్గొని సందడి చేయగలిగారు.
ఇవి కూడా చదవండి








