అమిత్ షా ప్రకటన.. బిల్లులో ఆ వివరాలు లేవు : వినోద్ కుమార్
దేశవ్యాప్తంగా మహిళ రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఆసక్తి రేపుతోంది. సంబంధిత బిల్లులపై లోక్సభ (Lok Sabha ) లో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ (Delimitation) పై పునర్విభజన కమిటీ మాజీ సభ్యుడు వినోద్ కుమార్ (Vinod Kumar) పలు వివరాలు మీడియాకు వెల్లడించారు. మహిళా రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాలకు 50 శాతం సీట్లు పెంచుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటించారు. కానీ, ఆయన ప్రకటనకు సంబంధించిన వివరాలు బిల్లులో లేవని తెలిపారు. డీలిమిటేషన్ పై ఆయన పలు విషయాలు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి








