Minister Thummala: దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో : మంత్రి తుమ్మల
తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు, అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడేలా గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, నాణ్యతా ప్రమాణాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ లో నిర్వహించిన ఓ సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ (Telangana) మొదటి స్థానంలో ఉందన్నారు. ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో రైతులకు మెరుగైన ఆదాయం అందించడానికి ఎగుమతులు, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్లపై దృష్టిని సారించాలని తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ కోసం మౌలిక వసతులు, అగ్రి ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఖమ్మం జిల్లా (Khammam District) బుగ్గపాడు వద్ద స్థాపించనున్న మెగా ఫుడ్ పార్క్ గురించి ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యాన రంగానికి, ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, పసుపు, మిర్చి వంటి పంటలకు ఎగుమతుల్లో మంచి అవకాశాలున్నాయన్నారు. సరఫరా, ఫ్యాక్ హౌస్లు, కోల్డ్ స్టోరేజీ, లాజిస్టిక్స్ నెట్వర్క్ మెరుగుపడితే అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తుల స్థానం మరింత బలపడుతుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి








