పెట్టుబడులు పెట్టండి.. అమెరికా పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం
రాకెట్ల నుంచి అత్యాధునిక డ్రోన్ల వరకు, యుద్ధ విమానాల విడి భాగాల నుంచి శాటిలైట్ల వరకు అన్నింటా మేడిన్ తెలంగాణ మార్క్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) పేర్కొన్నారు. సచివాలయంలో జరిగిన అమెరికాకు చెందిన నేషనల్ కాలేజ్ వార్ (National College War) బృంద సభ్యులతో మంత్రి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అమెరికా పారిశ్రామికవేత్తల (American Industrialists)ను ఆహ్వానించారు. ఏరోస్పేస్ (Aerospace), డిఫెన్స్ (Defense), స్పేస్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తున్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. ప్రిసిషన్ ఇంజనీరింగ్, డ్రోన్లు, డిఫెన్స్ ఎలక్ర్టానిక్స్ రంగాల్లో 1,500 కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ ఎఫ్‌డీఏ ర్యాంకింగ్స్ ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత కాస్ట్ ఎఫెక్టివ్ ఏరోస్పేస్ సిటీగా హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందన్నారు.
పెట్టుబడులతోపాటు సాంకేతికత, పరిశోధన, తయారీ, నైపుణ్యాభివృద్థిలో అమెరికాకు నమ్మకమైన దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామిగా నిలిచేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలతో కలిసి పని చేేసందుకు సిద్ధం. భవిష్యత్తులో ఆ దిశగా అడుగులు వేస్తాం. అమెరికా – తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సహకారం పెంపుదలకు చొరవ చూపుతాం అని స్టేట్ డిపార్ట్ మెంట్ మినిస్టర్ కౌన్సిలర్ పాల్ నరైన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి గ్లోబల్ కేపబుల్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రోటోల్యాబ్స్ టెక్నాలజీస్ ముందుకు వచ్చిందని శ్రీధర్‌బాబు తెలిపారు. మంత్రితో సమావేశమైన ప్రోటోల్యాబ్స్ ప్రతినిధి బృందం తమ విస్తరణ కార్యక్రమాలను వివరించారు.
ఇవి కూడా చదవండి








