సెగలు పుట్టిస్తున్న ఎండలు.. ఈ జిల్లాలకు హై అలర్ట్!
Telangana Weather: తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రధానంగా ఉత్తర , పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
ఉష్ణోగ్రతలు 41°C నుండి 44°C వరకు..
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్ వంటి జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41°C నుండి 44°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరికొన్ని జిల్లాల్లో టెంపరేచర్ 36°C నుండి 40°C మధ్య ఉండవచ్చని తెలిపింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళల్లో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎండలతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో రైతులు, వృద్ధులు , చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








