పోలీసులకు గుడ్ న్యూస్ చెప్పిన డీజీపీ
తెలంగాణ పోలీసుశాఖలో పనిచేస్తున్న సిబ్బందికి డీజీపీ బి. శివధర్ రెడ్డి (Shivadhar Reddy) శుభవార్త అందించారు. వారికి పుట్టినరోజు (Birthday)తో పాటు పెళ్లిరోజు (Wedding Anniversary) నాడు ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు నిరంతరం విధుల్లో తీవ్ర ఒత్తిడితో పనిచేస్తూ, వ్యక్తిగత జీవితానికి కుటుంబానికి సమయం కేటాయించలేక పోతున్నారని, ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా, అన్ని యూనిట్ అధికారులు తప్పనిసరిగా ఈ సెలవులు (Holidays) మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. డీజీపీ నిర్ణయంపై పోలీసు సిబ్బందిలో ఆనందం వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి








