Revanth Reddy: కేసీఆర్ ఫాం హౌస్ కు వెళ్తా..!
తెలంగాణాలో అత్యంత సంచలనంగా మారిన కేసుల్లో ఒకటిగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping) వ్యవహారంలో సిఎం రేవంత్ రెడ్డి నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. ఈరోజు అసెంబ్లీ అనంతరం మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందని.. కేవలం పంజాగుట్ట పీఎస్ లో నమోదైన ప్రైవేట్ కేసులో మాత్రమే క్లీన్ చిట్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
అయితే హరీష్ రావు(Harish Rao) మాత్రం మొత్తం కేసులో క్లీన్ చిట్ తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఒక పద్ధతి ప్రకారం ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతోంది అని, చర్యలు ఉంటాయని రేవంత్ స్పష్టం చేసారు. బీ ఆర్ ఎస్(BRS) హయంలో ఆరు వేల ఫోన్లు ట్యాప్ చేశారన్న రేవంత్ రెడ్డి, చేసిన తప్పుకు శిక్ష తప్పదని హెచ్చరించారు. విచారణ జరగకుండా అరెస్ట్ చేయలేం కదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే అనుమతి ఇచ్చిందన్నారు రేవంత్. ఇప్పటికే అరవింద్‌కుమార్‌ను సస్పెండ్ చేశామన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రభాకర్‌రావు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్(Kcr) ప్రస్తుతం ఫామ్ హౌజ్ లో.. హౌజ్ అరెస్ట్ లో ఎన్నారని.. వీలయితే వెళ్ళి పరమర్శిస్తా అంటూ సెటైరికల్ కామెంట్స్ చేసారు. ఇక మంత్రి వర్గ విస్తరణపై జరుగుతోన్న ప్రచారాన్ని కూడా రేవంత్ ఖండించారు. డిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రి వర్గ విస్తరణ అంటూ ప్రచారం చేస్తున్నారని, అది సరికాదని హితవు పలికారు. పాలన పరంగా డిల్లీకి వెళ్లడానికి అనేక కారణాలు అంశాలు ఉంటాయన్నారు రేవంత్. పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ ఇస్తున్నందుకు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు చెవిలో పువ్వులు పెట్టుకున్నారు అంటూ సీఎం ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి








