Sudheer Reddy: దోమ తెర కట్టుకుని అసెంబ్లీకి.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసన!
Sudheer Reddy: నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న దోమల సమస్యపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న రీతిలో తన నిరసనను వ్యక్తం చేశారు. ఒంటికి దోమ తెర ధరించి, చేతిలో ఫాగింగ్ యంత్రం పట్టుకుని నేరుగా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోవడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది.
మార్షళ్లతో వాగ్వాదం:
అనుమతి లేదన్న కారణంతో ఎమ్మెల్యేను అసెంబ్లీ మార్షళ్లు అడ్డుకున్నారు. ఆయన ధరించిన దోమ తెరను లాక్కునేందుకు ప్రయత్నించడంతో సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదని, ఇలాంటి సమయంలో కొత్త నిబంధనలు ఎక్కడివని ఆయన అధికారులను నిలదీశారు.
బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోంది:
అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. నగరంలో దోమల తీవ్రత భరించలేక ప్రజలు హైదరాబాద్ వదిలి పారిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల నగర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, దోమల బెడద నుంచి ప్రజలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి








