డీలిమిటేషన్తో సంబంధం లేకుండా అసెంబ్లీ సీట్లు పెంచాలి : కేటీఆర్
మహిళా బిల్లు వైఫల్యానికి బీజేపీ (BJP)దే బాద్యత అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే బిల్లు వీగిపోయిందన్నారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ (Lok Sabha) లో వీగిపోయిన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ సహా అన్ని పార్టీలు రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నా, బీజేపీ రాజకీయంతోనే మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిందని విమర్శించారు. మహిళలకు రిజర్వేషన్లు వచ్చేలా కొత్త బిల్లు తీసుకురావాలి. మహిళా సాధికారతపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయింది. బీజేపీ రాజకీయ స్వార్థానికి మహిళలు బలయ్యారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో బీజేపీ ఆడిన నాటకాన్ని ప్రజలు కళ్లారా చూశారు. డీలిమిటేషన్తో సంబంధం లేకుండా తెలంగాణలో అసెంబ్లీ సీట్లు (Assembly Seats) పెంచాలి అని డిమాండ్ చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








