Kishan Reddy: ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే రెండేళ్లు.. ఇంకెన్నేళ్లు చేస్తారో? : కిషన్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసు దర్యాప్తును టీవీ సీరియల్ లాగా సాగదీస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. దర్యాప్తు మొదలై ఇప్పటికే రెండేళ్లకు పైగా అవుతోందన్నారు. కేసీఆర్ (KCR) కుమార్తె కవితనే తన భర్త ఫోన్ ట్యాప్ అయిందని ఆరోపించారని గుర్తుచేశారు. హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ రాష్ట్ర పోలీసులు (Police) హైకోర్టులో అఫిడవిట్ వేశారని, ఇంకెన్నేళ్లు దర్యాప్తు చేస్తారని ప్రశ్నించారు. ట్యాపింగ్ ఎవరు చేసినప్పటికీ ప్రభుత్వం ద్వారా జరిగిందనేది వాస్తవమని, అందరి ఫోన్లూ ట్యాప్ అయ్యాయని చెప్పారు. ట్యాపింగ్ తీవ్రమైన నేరారోపణ ఉన్న కేసు అని, ఈ ఘటనలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు.కాంగ్రెస్ (Congress), బీఆర్ఎ్సలు అవినీతికి కొమ్ముకాస్తున్నాయని, ఆ పార్టీలపై ప్రజలకు విశ్వాసం లేదన్నారు. తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెబుతార పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం ఆస్తుల వాటాల కోసం కొట్టుకుంటుంటే రేవంత్ సర్కారులో మంత్రులు కూడా రోడ్డున పడి డబ్బుల వాటాల కోసం కొట్లాడుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో తెలంగాణ సర్కారు ఉందని ఆయన అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






