Kavitha: సిట్ విచారణకు పిలిస్తే వెళ్తా: కవిత
ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసు లో రెండేళ్లవుతున్నా సిట్ (SIT) విచారణ ముగింపునకు రావడం లేదని తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. విచారణ త్వరగా ముగిసి దోషులకు శిక్ష పేడలా చూడాలని కోరారు. సిట్ విచారణలో ఏం జరిగిందో మాజీ సీఎం కేసీఆర్ (KCR) చెప్తారని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సిట్ విచారణను తప్పుపడుతూ కేటీఆర్(KTR) మాట్లాడటం సరికాదు. చట్టాలను అందరూ గౌరవించాలి, సహకరించాలి. గుంట నక్కలతో కలిసి కాంగ్రెస్ డ్రామాలాడుతోంది. నాతో పాటు నా భర్త ఫోన్లు ట్యాప్ చేశారనే అనుమానాలున్నాయి. సిట్ అధికారులు విచారణకు పిలిస్తే వెళ్లి సహకరిస్తాను అని అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






