Mahesh Kumar: వంద సీట్లతో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి : మహేష్ కుమార్ గౌడ్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే మళ్లీ అధికారం అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ధీమా వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ (BRS) నాలుగు ముక్కలైందన్నారు. తెలంగాణలో బీజేపీ (BJP)కి చోటు లేదన్నారు. గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్గా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మహేశ్ కుమార్ మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) వంద సీట్లతో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్కు క్లిష్ట సమయాల్లో దళితులు అండగా నిలబడ్డారని, రాబోయే పదవుల పంపకాల్లో ఎస్సీలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. భవిష్యత్తుల్లో ఎస్సీల తరపున కవ్వంపల్లి సూచించిన వారికి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడంలో ప్రాధాన్యం ఉంటుందన్నారు.

ఇవి కూడా చదవండి








