Revanth Reddy: మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్..
మెడికవర్ హాస్పిటల్స్ కి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.. వైద్యం యాంత్రికం గా ఉండొద్దు.. మానవత్వం తో కూడిన వైద్య సాయం అందించాలి.. దేశం లో హైదరాబాద్ నుంచి 40 శాతం ఫార్మా ఉత్పత్తులు ఉన్నాయి.. కరోనా వాక్సిన్ ల్లో మూడు మన జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి కావడం మనకు గర్వ కారణం.. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి,పీవీ నరసింహరావు సరళీకరణ విధానాలు తీసుకువచ్చి హైదరాబాద్ అభివృద్ధి కి పునాదులు వేశారు..
చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ ని పూర్తి చేసి ఐటీ హబ్ గా మార్చారు.. నాణ్యమైన విద్య ను అందిచాలన్న ఆలోచన తో విద్యా విధానం లో మార్పులు తెస్తున్నం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12 తరగతి విధానం తీసుకువస్తాం.. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్,భోజనం తో పాటు ట్రాన్స్పోర్ట్ కల్పిస్తాం.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితం గా లేదా 50 శాతం రాయితీ తో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తాం.. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం..
ఇవి కూడా చదవండి

విద్యను అందిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.. మహిళలు ఆరోగ్యం బాగుంటే కుటుంబం బాగుంటుంది.. 65 లక్షల మంది హెల్త్ డేటా ను తయారు చేస్తున్నాం. వాళ్ళకి డిజిటల్ హెల్త్ కార్డ్ ఇస్తాం. 20 ఏళ్ల ఆరోగ్య శ్రీ డేటా ను ఉపయోగించి డేటా తయారు చేస్తున్నాం.. క్యాన్సర్ పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.. డాక్టర్ నోరి దత్తాత్రేయ ను సలహా దారుడిగా నియమించాం.. ఆరోగ్య శ్రీ,సీఎంఆర్ ఎఫ్ కోసం 1800 కోట్లు ఖర్చు చేశాం. ఉస్మానియా, టిమ్స్ హాస్పిటల్ ల నిర్మాణం,మహుళిక సదుపాయాల కోసం 10 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. సామాన్యులు భరించలేని విధంగా వైద్యం ఖర్చులు పెరిగిపోయాయి. ప్రైవేట్ రంగం లో ఉన్న డాక్టర్ లు ఏడాది లో ఒక నెల ప్రభుత్వ ఆసుపత్రి లల్లోపనిచేయాలి. రాష్టం లో ని కోటి ముప్పై లక్షల కుటుంబాలకు జీవిత బీమా అందించాలని భావిస్తున్నాం.
ఇవి కూడా చదవండి








