బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన బిఆర్ఎస్
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని బిఆర్ఎస్వీ (BRSV) నేతలు ముట్టడించారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya) వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వెంటనే తేజస్వి తెలంగాణ (Telangana) ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యాలయం వద్ద బిఆర్ఎస్వీ, బీజేవైఎం నేతల మద్య వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో బిఆర్ఎస్వీ నేతలను పోలీసులు (Police) అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
ఇవి కూడా చదవండి








