Avinash Reddy: ఈ విషయం ప్రభుత్వానికి తెలుసా? : ఎంపీ అవినాష్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో నాటుకోడి (కంట్రీ చికెన్) రిటైల్ ధరలు మటన్ కంటే ఎక్కువగా పెరిగిపోయాయని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(Avinash Reddy) పార్లమెంట్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలుసా అని లోక్సభ (Lok Sabha)లో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పౌల్ట్రీ రైతుల కోసం రోగ నియంత్రణ, బయోసెక్యూరిటీ, పౌల్ట్రీ బీమా చర్యలను తీసుకుందా? ఒకవేళ తీసుకోకపోతే అందుకు కారణాలేంటి అని సందేహం వ్యక్తం చేశారు. దీనికి కేంద్ర పశుసంవర్థకశాఖ మంత్రి రాజీవ్రంజన్సింగ్ (Rajiv Ranjan Singh) బదులిస్తూ ఏపీలో నాటుకోడి (Country chicken) మాంసం ధర కిలో రూ.500 ఉండగా మటన్ ధర దాదాపు రూ.900 ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్థకశాఖ నుంచి సమాచారం అందింది అని సమాధానమిచ్చారు. అందువల్ల ఎంపీ లేవనెత్తిన మిగతా ప్రశ్నలేవీ ఉత్పన్నం కావని స్పష్టం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






