TTD: టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి(ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal) పై బదిలీ వేటు పడింది. టీటీడీకి కల్తీ నెయ్యి (Ghee) సరఫరా వ్యవహారంలో అప్పట్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని సిట్ (SIT) ప్రభుత్వానికి లేఖ రాయడంతో అప్పటి, ప్రస్తుత ఈవో సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆయన్ను ఆదేశించింది. ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్ర (Muddada Ravichandra)కు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యత అప్పగించింది. ఈలోగా సింఘాల్ నుంచి ఛార్జి తీసుకోవాలని ఆదేశించడంతో అదనపు ఈవో వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






