Minister Narayana: విశాఖ అభివృద్ధికి హడ్కో సహకారం : మంత్రి నారాయణ
విశాఖ నగరాభివృద్ధికి హడ్కో సహకారం కీలకమని రాష్ట్ర మంత్రి నారాయణ (Narayana) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఆదాయ మార్గాలను అన్వేషిస్తామన్నారు. విశాఖ మెట్రో ప్రాజెక్టు (Visakhapatnam Metro Project) ను కేంద్రం పరిశీలిస్తోందని తెలిపారు. విశాఖ మెట్రోను రైడర్స్ సంస్థ అధ్యయనం చేస్తోందని, రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) ఓఆర్ఆర్ లా విశాఖకు సెమీ రింగ్ రోడ్డు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రాంబిల్లి భోగాపురం ప్రాజెక్టును వీఎంఆర్ డీయే పరిశీలిస్తోందన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్డులో ఒక రోడ్డుకు అటవీ భూమి అడ్డంకిగా ఉందని, సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్, తాను మాట్లాడి సమస్యను పరిష్కరించామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});







