Minister Narayana: మరో నెల రోజుల సమయం ఇస్తున్నాం : మంత్రి నారాయణ
ఉండవల్లి వద్ద బకింగ్ హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ( Narayana) పరిశీలించారు. సీడ్ యాక్సెస్ రోడ్డును మంగళగిరి (Mangalagiri) రహదారికి అనుసంధానించే పనుల్లో మరో 4.5 ఎకారాలు భూ సమస్య ఉంది. భూ సేకరణ చేసేందుకు అవకాశం ఉన్నా, మరో నెల రోజులు సమయం ఇస్తున్నాం. ఏప్రిల్ 9 నాటికి భూసమీకరణకు రైతులు ముందుకు రాకుంటే, భూసేకరణ చేపడతాం. భూ సమీకరణకు రైతులు సహకరించాలి. బకింగ్ హాం కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ (Steel Bridge) పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థలు చెబుతున్నాయి. బకింగ్ హాం కెనాల్ కంటే ముందు మరో 2 స్టీల్ బ్రిడ్జ్‌లు గుంటూరు (Guntur) ఛానల్, కొండవీటి వాగులపై రానున్నాయి. ఇవి కూడా పూర్తయితే సీడ్ యాక్సెస్ రహదారి పూర్తయినట్లే అని తెలిపారు.
ఇవి కూడా చదవండి








