Minister Narayana: పని చేయలేకపోతే వెళ్లిపోవాలి : మంత్రి నారాయణ ఆగ్రహం
రాజధాని ప్రాంతంలోని నేలపాడులో నిర్మిస్తున్న గెజిటెడ్ అధికారులు (Gazetted Officers), గ్రూప్ -డి (Group-D) క్వార్టర్స్ తో పాటు వివిధ నిర్మాణాల పనులను మంత్రి నారాయణ (Minister Narayana) పరిశీలించారు. పనులు ఆలస్యం చేస్తున్నారంటూ కాంట్రాక్ట్ సంస్థలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అందుకు తగినవిధంగా నిర్మాణ సంస్థలు పని చేయాలన్నారు. పని చేయలేకపోతే వెళ్లిపోవాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. షాపూర్ జీ పల్లోంజీ కన్స్ట్రక్షన్ సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులను పంపించేయాలని ఆదేశించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాజధానిపై వైసీపీ నాయకులు (YCP leaders) చేసే విమర్శలు అర్థరహితమని అన్నారు. ఆ పార్టీ నేతలు చేసే ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు.
ఉద్యోగులకు నిర్మిస్తున్న 4,026 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడకుండా ఉండి ఉంటే ఇప్పటికీ అన్నీ అందుబాటులోకి వచ్చేవని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టామన్నారు. రానున్న మూడేళ్లలో పరిపాలనకు సంబంధించిన భవనాలను అందుబాటులోకి తెస్తామన్నారు. రోడ్ల పనులు 3 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వర్షాకాలంలో నిర్మాణపనులకు ఇబ్బందిలేకుండా భూగర్భపనులు ముందుగా పూర్తి చేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి








