Minister Narayana:లండన్ లో మంత్రి నారాయణ పర్యటన
లండన్ (London) నగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, అభివద్ధి ప్రణాళికలు, రవాణా సౌకర్యాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక,పట్టణాభివద్ధి శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) ఆధ్వర్యంలో అధికారుల బందం అధ్యయనం చేసింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక, వాణిజ్య, సాంస్కతిక కేంద్రాల్లో ఒకటై రెండు వేల ఏళ్ల చరిత్ర కలిగిన లండన్ నగరాభివద్ధిపై అక్కడి నగర ప్రణాళికాభివద్ధి విభాగం డైరెక్టర్ గిన్ రిచర్డ్స్తోనూ సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణంలో భాగంగా పలు ప్రాజెక్టుల అభివద్ధికి లండన్, దోహాల్లో అధ్యయనం చేసేందుకు మంత్రి నారాయణతోపాటు పురపాలక, పట్టణాభివద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్‌కుమార్, అమరావతి గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ (Director Srinivas) విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అమరావతిలో పర్యాటక ప్రాజెక్టులు, రివర్ ఫ్రంట్ అభివద్ధి, అంతర్జాతీయ క్రీడా నగరం నిర్మాణం కోసం పలు ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాలన్నది వీర పర్యటన ఉద్దేశం లండన్ చేరుకున్న వీరు లండన్ సిటీ మినియేచర్ ద్వారా నగర నిర్మాణ తీరును పరిశీలించారు. లండన్‌లో బాటర్సీ పవర్‌స్టేషన్‌ను మంత్రి బందం సందర్శించింది. దశాబ్దాలపాటు విద్యుత్తు ఉత్పత్తి చేసి మూతపడిన పవర్ స్టేషన్‌ను ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు.





