Kishan Reddy: మోదీ నాయకత్వంలో భారత్ సేఫ్ జోన్ లో : కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ ఉగాది (Ugadi) సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు చెప్పారు. మోదీ (Modi) నాయకత్వంలో దేశం ఆధ్మాత్మిక, అభివృద్ధితో పాటు శాంతిబాటలో నడుస్తోందన్నారు. ప్రపంచమంతా యుద్ధ భూమిలే ఉంటే భారతదేశం మాత్రం ప్రధాని మోదీ నాయకత్వంలో సురక్షితంగా ఉందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి








