Justice Lisa Gill: న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ గా జస్టిస్ లీసాగిల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ (Justice Lisa Gill) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు (High Court)లో రెండో స్థానంలో ఉన్న న్యాయమూర్తిని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ (Chairman) గా నియమించడం సంప్రదాయంగా వస్తోంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ను గవర్నర్ నామినేట్ చేస్తారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








