Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీకి ఆహ్వానం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram Airport) పనులు శరవేగంగా సాగుతున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) తెలిపారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జూలై 5న ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్టు ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 50 ఎయిర్ పోర్టులు, పదేళ్లలో 100 ఎయిర్ పోర్టులు, 200 హెలీప్యాడ్లు నిర్మించాలని ప్రధాని మోదీ నిర్దేశించారని చెప్పారు. అమరావతి చట్టబద్ధత బిల్లును వ్యతిరేకించి వైసీపీ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోయారని చెప్పారు. జగన్ తానా అంటే తందానా అనే వైసీపీ నేతలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. అమరావతి (Amaravati) అంటే రాష్ట్ర ప్రజల ఐక్యతకు ప్రతీక అని చెప్పారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ భూదందాలకు పాల్పడిందని, రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడమేవారి అజెండా అని విమర్శించారు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.







