కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి లోకేష్ కు ఆహ్వానం
ఉండవల్లి: చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం (Kanipakam ) శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కు ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ ( Murali Mohan), దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ (Ramachandra Mohan), ఆలయ ఛైర్మన్ సురేంద్రబాబు(Surendra Babu) ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మంత్రి లోకేష్ కు వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.








