ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ధవళేశ్వరం బ్యారేజీ (Dowleswaram Barrage) గేట్ల పునరుద్దరణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రారంభించారు. పునరుద్దరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 2014-19 మధ్య కాలంలో ధవళేశ్వరం బ్యారేజీకి 58 కొత్త గేట్లను అప్పటి టీడీపీ ప్రభుత్వం (TDP government) అమర్చింది. ఇప్పుడు సీడబ్ల్యూసీ (CWC) సూచనల మేరకు మిగిలిన 117 గేట్లకు కొత్త గేట్లను అమర్చే పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో సీఎం మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నెల నాటికి కొత్త గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు.








