అమరావతిని అడ్డుకోవడానికే తప్ప.. వాళ్లపై ప్రేమతో కాదు
రాజధాని అమరావతిపై విషం చిమ్మడాన్ని గొడ్డలి పార్టీ ఆపడం లేదని టీడీపీ పొటిట్బ్యోరో సభ్యుడు, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు (Nakka Anandababu) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి (Amaravati)ని అడ్డుకోవడానికే అరశాతం మంది రైతులను జగన్ (Jagan) వాడుకుంటున్నారు. అంతేతప్ప వాళ్లపై ప్రేమతో కాదు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు, రాజధాని పై విషం చిమ్మేందుకు గొడ్డలి పార్టీ నానా తంటాలు పడుతోంది. అమరావతికి 99.50 శాతం మంది రైతులు తమ భూములను త్యాగం చేశారు. భూములివ్వట్లేదని చెప్పిన అరశాతం రైతులను అడ్డుపెట్టుకుని వైసీపీ (YCP) కుతంత్రాలు చేస్తోంది అని విమర్శించారు.








