ఆ పదవి కన్నా బీజేపీ అధ్యక్షుడిగానే ఆనందం : వెంకయ్య నాయుడు
ఉపరాష్ట్రపతి హోదా కన్నా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉండడమే ఆనందాన్ని ఇచ్చిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ( Venkaiah Naidu) అన్నారు. విశాఖలో వెంకయ్య నాయుడు జీవితంపై పాత్రికేయుడు మాశర్మ (Maa Sharma) రచించిన వెంకయ్య నాయకుడు పుస్తక పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఆ పుస్తకాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి (Vice President)గా వెళ్లాలని కోరినప్పుడు నాకు ఉత్సాహం రాలేదు. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. పార్టీలో ఏ పదవైనా స్వీకరిస్తానని చెప్పా. ఆ పదవిలో నియమించడానికి ఓ కారణం ఉందన్నారు. రాజ్యసభ (Rajya Sabha)లో కొన్ని కీలక బిల్లుల ఆమోదం అవసరం. అక్కడ చూస్తే మెజారిటీ లేదు. సభను సమర్థంగా, చాకచక్యంగా నడిపించాలి. రాజ్యసభ చైర్మన్గా ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉందంటేనే ఆ పదవికి అంగీకరించాను అని అన్నారు.








