పవన్ కల్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముంబయి వెళ్లారు. అక్కడ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను చంద్రబాబు (Chandrababu) పరామర్శించారు. పవన్ కుడి భుజానికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దీంతో చంద్రబాబు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి అన్నా కొణిదె (Anna Konidhe)లను వాకబు చేశారు. చంద్రబాబు వెంట మంత్రులు నారాయణ (Narayana), నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) ఉన్నారు.
పవన్ను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పవన్ కుడి భుజానికి ఆపరేషన్ విజయవంతమైంది. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించారు. పవన్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. వైద్యులు మూడు వారాలు విశ్రాంతి అవసరమని చెప్పారు. ఆయన రెండో భుజానికీ సమస్య ఉంది. దానికి ఆపరేషన్ చేయాలా? ఫిజియో థెరపీ సరిపోతుందా? అనేది వైద్యులు పరిశీలిస్తున్నారు అని తెలిపారు.








