అమెరికాలో మృతి ..మూలపాడు చేరుకున్న లక్ష్మీప్రసన్న మృతదేహం
అమెరికాలోని న్యూయార్క్ (New York) లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన అట్లూరి లక్ష్మీ ప్రసన్న (Atluri Lakshmi Prasanna) (28)మృతదేహాన్ని స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా (NTR District) మూలపాడుకు తీసుకొచ్చారు. రెండు నెలల కిందట నవ్వుతూ అందరికీ వీడ్కోలు చెప్పిన ఆమె మృతి అందరినీ కలచివేసింది. కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు మల్లేశ్వరి, వసంతరావుల ఆక్రమందన చూపరులను కంటతడి పెట్టించింది. బంధువులు, గ్రామస్థుల కడసారి చూపు అనంతరం సమీపంలోని శ్మశాన వాటికకు మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి, ఎన్ఆర్ఐ కోమటి జయరాం ( Komati Jayaram) చొరవతో లక్ష్మీ ప్రసన్న మృతదేహం మూలపాడుకు చేరుకుంది. ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన మృతదేహాన్ని అంబులెన్స్‌లో మూలపాడు తీసుకొచ్చారు.








