తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను నిరాకరించిన సుప్రీంకోర్టు
పోలవరం (Polavaram), గోదావరి నీటి వినియోగం, బనకచర్ల అనుసంధానం అంశాలపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. తెలంగాణ వేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్ (Justice Vikram Nath) ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వాని (AP government)కి నోటీసులు ఇవ్వాలని, ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కోరింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన పిటిషన్లో లోపాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. లోపాలు సరిదిద్దే వరకు విచారణ చేపట్టడం కుదరదని స్పష్టం చేసింది. 15 మంది ప్రతివాదులు ఉన్నారని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. లోపాలు సరిదిద్దాక విచారణలో మిగతా అంశాలు పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది. పిటిషన్‌పై విచారణ జరపకుండా నోటీసులివ్వలేమని తెలిపింది.








