Ambati Rambabu: స్లీప్ అప్నియా పరికరంతో అంబటి రాంబాబు నిద్ర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)ను దూషించిన కేసులో రాజమహేంద్రవరం (Rajahmundry) కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు స్లీప్ అప్నియా పరికరం సాయంతో నిద్రిస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలునన వారు దీనిని ఉపయోగిస్తారని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు ఉన్నవారిలో నిద్రిస్తున్న సమయంలో ఒక్కోసారి శ్వాస తీసుకునే స్థాయి బాగా తగ్గిపోయి, మళ్లీ కాసేపటికి పునరుద్ధరణ అవుతుంది. ఆ సమయంలో శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోకుండా ఈ పరికరం ఉపకరిస్తుంది. ఈ సమస్య ఎప్పుడు తలెత్తుతుందో తెలియనందున నిద్రకు ఉపక్రమించే ముందు అమర్చుతుంటారు. కోర్టు (Court) ఆదేశాల మేరకు అంబటికి ఈ పరికరం సమకూర్చామని జైలు అధికారులు తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






