Minister Narayana: ప్రపంచంలోనే అత్యుత్తమ అసెంబ్లీ భవనం ఏపీలో : నారాయణ
రాష్ట్ర రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణాలకు కేంద్రం నుంచి రూ.15 వేలకోట్లు, హడ్కో ద్వారా మరో రూ.11 వేలకోట్లు సమకూరుస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ (Narayana) వెల్లడించారు. కాకినాడ కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడారు. అమరావతితో అసెంబ్లీ (Assembly), హైకోర్టు (High Court), ఐదు టవర్ల ఐకానిక్ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. అసెంబ్లీ 250 మీటర్ల ఎత్తులో ఉంటుందని, ప్రజలు పైకి వెళ్లి నగరం మొత్తాన్ని చూడవచ్చని తెలిపారు. ఇది ప్రపంచంలోనే ఉత్తమ అసెంబ్లీల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇతర రాష్ట్రాల ఐకానిక్ భవనాల రేట్లతో పోల్చితే ఎస్ఆర్ రేట్ల ప్రకారం నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామన్నారు. అమరావతిలో నిర్మించే ఐకానిక్ భవనాల టెండర్లపై వైసీపీ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. అమరావతి పనులు ఇక ఆపలేమని వైసీపీ నాయకులకు అర్థమైపోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల అమరావతి నిర్మాణం ముందుకు వెళ్లదని అనుకున్నారని, సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి మోదీతో మాట్లాడి వివిధ రూపాల్లో అమరావతి నిర్మాణాలకు నిధులు తీసుకొస్తున్నారని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ విప్ యనమల దివ్య, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి








