Donald Trump: ట్రంప్ నిర్ణయంతో ఇరాన్ కు కాసుల వర్షం..!
అమెరికా-ఇరాన్(America – Iran) మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక వింత పరిణామం చోటుచేసుకుంది. ఒకవైపు ఇరాన్‌పై విరుచుకుపడుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, మరోవైపు ఆ దేశ చమురు విక్రయాలపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. ఈ నిర్ణయం ఇప్పుడు ఇరాన్ పాలిట వరప్రసాదంలా మారింది. కేవలం కొద్ది రోజుల్లోనే ఇరాన్(Iran) ఖజానాలోకి భారీగా నిధులు వచ్చి చేరుతున్నాయి. అమెరికా విధించిన 30 రోజుల ఆంక్షల సడలింపు (Waiver) వల్ల ఇరాన్ సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేస్తుంది.
ఇవి కూడా చదవండి
ప్రస్తుత ధరల ప్రకారం, దీని విలువ దాదాపు 14 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ. 1.15 లక్షల కోట్లు ఉంటుందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యుద్ధం వల్ల ఆర్థికంగా చితికిపోయిన ఇరాన్‌కు ఇది ఊపిరిపోసినట్లయింది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటాయి. ఇది అమెరికాలో గ్యాసోలిన్ ధరలు పెరగడానికి కారణం అయింది. తన దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి, చమురు సరఫరాను పెంచి ధరలను అదుపులోకి తేవడమే లక్ష్యంగా ట్రంప్ ఈ రిస్క్ తీసుకున్నారు.
శత్రువును దెబ్బకొడుతూనే, వారి చమురుతోనే తన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలనేది ట్రంప్ ప్లాన్ గా కనపడుతోంది. ఇరాన్ చమురుపై ఆంక్షలు తొలగడంతో అత్యంత సంతోషంగా ఉన్న దేశం చైనా. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ట్యాంకర్లు ఇప్పుడు చైనా(china) పోర్టుల వైపు పరుగులు తీస్తున్నాయి. అటు భారత్ కూడా ఇరాన్ నుంచి తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతోంది. దీనివల్ల మన దేశంలో కూడా పెట్రోల్ ధరలు కొంత మేర తగ్గే అవకాశం ఉంది. అయితే, ఈ నిర్ణయంపై అమెరికాలోనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆంక్షలు ఎత్తివేయడం వల్ల ఇరాన్‌కు వచ్చే బిలియన్ల కొద్దీ డాలర్లను వారు తమ సైనిక అవసరాలకు, క్షిపణుల తయారీకి వాడుకుంటారని రిపబ్లికన్లే కొందరు విమర్శిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








