Supreme Court: మమతా బెనర్జీపై సుప్రీంకోర్టు ఫైర్
పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి(Mamata Banerjee) సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. . కోల్కతాలోని ఐ-ప్యాక్(I – Pac) కార్యాలయంపై ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తుండగా ఆమె జోక్యం చేసుకోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఈడీ అధికారులకు ప్రాథమిక హక్కులు ఉండవా అంటూ.. ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇవి కూడా చదవండి
గత జనవరిలో ఐ-ప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుండగా, మమతా బెనర్జీ తన భద్రతా సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి దర్యాప్తును అడ్డుకున్నట్లు ఈడీ ఆరోపించింది. అంతేకాకుండా, కీలకమైన డాక్యుమెంట్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తన పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ సందర్భంగా.. ఈడీ అధికారులు కూడా వ్యక్తులేనని, విధి నిర్వహణలో ఉన్నప్పుడు వారి ప్రాథమిక హక్కులను కాలరాయడం సరికాదని కోర్టు పేర్కొంది. ఈడీ అధికారులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు తమ ప్రాథమిక హక్కులను కోల్పోతారా?” అని బెంగాల్ ప్రభుత్వం తరఫు న్యాయవాదులను కోర్టు ప్రశ్నించింది.
ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి దర్యాప్తు సంస్థల పనిని అడ్డుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇది ఒక అసాధారణ పరిస్థితి అని కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు సంస్థలను ఇలాగే అడ్డుకుంటే, దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు పని చేయడం కష్టమవుతుందని, ఎవరూ చట్టానికి అతీతులు కాదని హెచ్చరించింది. ఈడీ అధికారులపై పశ్చిమ బెంగాల్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR)లపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన స్టేను పొడిగించింది. మమతా బెనర్జీ తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. రాజకీయ ప్రేరేపితమైన దాడుల నుంచి పార్టీ డేటాను కాపాడటానికే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లారని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈడీ అనేది కేవలం ప్రభుత్వంలోని ఒక శాఖ మాత్రమేనని, అది ఆర్టికల్ 32 కింద హక్కులను కోరలేదని వాదించారు. అయితే, ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చింది.
ఇవి కూడా చదవండి








