Israel: పాక్ కంటే భారత్ బెటర్ అంటున్న ఇజ్రాయిల్..!
పశ్చిమ ఆసియాలో రోజురోజుకూ యుద్ధం తీవ్రమవుతోన్న నేపథ్యంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇజ్రాయిల్ – ఇరాన్(America-Israel-iran) దేశాల మధ్య నెలకొన్న యుద్ధంలో పాకిస్తాన్ (Pakistan)కంటే భారతదేశమే అత్యంత మెరుగైన మధ్యవర్తిగా వ్యవహరించగలదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రత్యేక రాయబారి ఫ్లూర్ హసన్-నహూమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. అమెరికా-ఇరాన్‌ల మధ్య పరోక్ష చర్చలను సులభతరం చేయడానికి టర్కీ, ఈజిప్ట్, సౌదీ అరేబియా వంటి ప్రాంతీయ దేశాల మద్దతుతో పాకిస్తాన్ ఒక కీలక మధ్యవర్తిగా అవతరించింది.
ఇవి కూడా చదవండి
ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి సంబంధించి ఒక 15-సూత్రాల కార్యాచరణ ప్రణాళికను కూడా పాకిస్తాన్ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ పరోక్ష చర్చలు సానుకూల పురోగతిని సాధిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పేర్కొన్నారు. పాకిస్తాన్ ఈ వ్యవహారంలో చొరవ తీసుకుంటున్నప్పటికీ, భారత్ యొక్క.. సమతుల్య వైఖరి, అంతర్జాతీయ దౌత్య సంబంధాల వల్ల భారత్ అయితే మరింత మెరుగైన పాత్ర పోషించగలదని ఇజ్రాయెల్ ప్రత్యేక రాయబారి ఫ్లూర్ హసన్-నహూమ్ అభిప్రాయపడ్డారు.
భారత్.. ఇజ్రాయెల్‌కు చాలా సన్నిహిత మిత్రదేశం. యుద్ధానికి కొన్ని రోజుల ముందే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ పర్యటించారు. భారత్ ప్రపంచంలోని అన్ని దేశాలతోనూ, ఇటు ఇజ్రాయెల్ అటు ఇరాన్ సహా ఇతర ప్రాంతీయ భాగస్వాములతో అత్యుత్తమ సంబంధాలను కొనసాగిస్తోందని మాకు తెలుసన్నారు. తనను అడిగితే.. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ కంటే భారత్ చాలా మెరుగైన మధ్యవర్తిగా ఉండగలదని ఆశాభావం వ్యక్తం చేసారు. భారత్ కు ఇజ్రాయెల్‌తో రక్షణ, సాంకేతిక రంగాలలో వ్యూహాత్మక సంబంధాలు ఉన్నట్లే.. ఇరాన్‌తో చారిత్రాత్మక, చమురు వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. అలాగే అరబ్ దేశాలతోనూ భారత్ సత్సంబంధాలను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని చల్లార్చడానికి భారత్ తన పరపతిని ఉపయోగిస్తే అది మరింత ప్రభావవంతంగా ఉంటుందన్నది ఇజ్రాయెల్ రాయబారి మాటలను బట్టి స్పష్టమవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి








