Iran: ఇరాన్ టాప్ ఆఫీసర్ ను లేపేసారు..!
ఇరాన్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న, మాజీ పార్లమెంటు స్పీకర్, సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఇరాన్(Iran) తో పాటుగా గల్ఫ్ దేశాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆయన చనిపోవడానికి సరిగ్గా ఒక్క రోజు ముందే ‘ఎప్‌స్టెన్ నెట్వర్క్’ (Epstein Network) కుట్ర గురించి హెచ్చరించడం ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తోంది. మార్చి 15 న ఇరాన్ రాజధాని టెహ్రాన్(Tehran)లో అలీ లారిజానీని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన మరణించినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థలు ధృవీకరించాయి.
ఇవి కూడా చదవండి
ఇది ఇజ్రాయెల్ లేదా అమెరికా(America) నిఘా సంస్థల పనే అని ఇరాన్ ఆరోపిస్తోంది. అలీ లారిజానీ చనిపోవడానికి సరిగ్గా 24 గంటల ముందు ఒక సంచలన ప్రకటన చేశారు. అమెరికాలోని అత్యంత వివాదాస్పదమైన ‘జెఫ్రీ ఎప్‌స్టెన్’ నెట్‌వర్క్‌కు సంబంధించిన రహస్య పత్రాలు, ఆ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న అంతర్జాతీయ నేతల జాబితా తన వద్ద ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కుట్రను త్వరలోనే బయటపెడతానని ఆయన చెప్పిన మరుసటి రోజే హత్యకు గురవ్వడం గమనార్హం. పాశ్చాత్య దేశాల అగ్రనేతల అసలు రంగును బయటపెట్టే సమాచారం మా దగ్గర ఉందని ఆయన కామెంట్ చేసారు.
అలాగే ఎప్‌స్టెన్ బ్లాక్మెయిల్ రింగ్‌లో ఎవరెవరు ఉన్నారో ప్రపంచానికి తెలుస్తుంది అని లారిజానీ వ్యాఖ్యానించారు. ఈ సమాచారం బయటకు వస్తే అమెరికాలోని చాలా మంది శక్తివంతమైన వ్యక్తుల పదవులు ఊడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన లారిజానీ హత్యతో ఇరాన్ ప్రభుత్వం దిగ్భ్రాంతికి లోనైంది. ఇది కేవలం రాజకీయ హత్యేనా లేక ఆ రహస్య పత్రాలను తొక్కిపెట్టడానికి జరిగిన అంతర్జాతీయ కుట్రనా? అనే కోణంలో ఇరాన్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేస్తోంది. ఈ హత్యపై అమెరికా గానీ, ఇజ్రాయెల్ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, ఎప్‌స్టెన్ నెట్వర్క్ గురించి లారిజానీ చేసిన వ్యాఖ్యల వల్లే ఆయన ప్రాణాలు పోయాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి








