“మా తప్పేమీ లేదు..’’ అన్న సిగ్నల్స్ పంపడానికే మోదీ ప్రసంగించారా?
లోక్ సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు పాస్ కాకపోవడంపై భారత మహిళలందర్నీ క్షమాపణ కోరుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్ వాదీ వంటి పార్టీల స్వార్థ రాజకీయాల కారణంగా దేశ మహిళలకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాత్రి జాతినుద్దేశించి 30 నిమిషాలు ప్రసంగించారు. ఈ ప్రసంగం ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంలో తమ ప్రమేయం ఏమీ లేదని చెప్పినట్లైందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా బంతిని ప్రతిపక్షాల కోర్టులోకి నెట్టేసి, రాజకీయంగా వారిని ఇబ్బందుల్లోకి నెట్టేయాలని వ్యూహం వేసినట్లు తెలిసిపోతోంది.
ప్రధాని ప్రసంగంలో ఈ విషయాలు స్పష్టంగా కనిపించాయి. తాము ఈ బిల్లు పాస్ కావడానికి సర్వ శక్తులూ ఒడ్డామని, కానీ.. కాంగ్రెస్ దాని మిత్రపక్షాల రాజకీయం కారణంగా వీగిపోయిందని ప్రజల ముందు వుంచారు. అంతేకాకుండా దేశంలోని చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కూడా కాంగ్రెస్సే ప్రధాన కారణమని, కాంగ్రెస్ వల్లే ఇదంతా అంటూ కాంగ్రెస్ ను రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నం చేసినట్లైంది.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటుచేసి , విపక్షాలకు దానిని వివరించి, తాము ఎందుచేత కట్టుబడ్డామో వివరిస్తే అది కాస్త దారిలో పడేది. కానీ.. అలా చేయకుండా కేవలం ప్రతిపక్షాలనే టార్గెట్ చేయడానికి ఈ బిల్లు పెట్టారని, బిల్లు వీగిపోయిన తర్వాత జాతినుద్దేశించి ప్రసంగిస్తూ విపక్షాలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే విధంగా ప్రసంగం వుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాకుండా ఈ ప్రసంగం ద్వారా తమ ప్రభుత్వం సంస్కరణల పిపాసి అని ప్రజలకు వివరించినట్లు కూడా అయ్యిందన్న కోణంలోనూ చర్చ సాగుతోంది. పెద్ద నోట్ల రద్దు, డిజిటలైజేషన్, లాంటి సంస్కరణలు తమ వల్లే సాధ్యం అవుతాయని, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటి సంస్కరణ కూడా తమ వల్లే సాధ్యమవుతుందని, కానీ కాంగ్రెస్ అడ్డుపుల్ల వేసిందన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్లినట్లైందని అంటున్నారు.
మరోవైపు మోదీ ప్రతిపక్షాల వారు దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేరానికి పాల్పడ్డారని, స్త్రీ శక్తికి వ్యతిరేకంగా నేరం చేశారన్నారు. మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ ద్వేషిస్తోందన్నారు. ‘కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మహిళల శక్తిని తక్కువగా అంచనా వేశాయి. మహిళలు దేనినైనా మర్చిపోవచ్చు. కానీ తమకు జరిగిన అవమానాన్ని ఎన్నటికీ మర్చిపోరు. వారు అన్నీ గమనిస్తున్నారు. కచ్చితంగా శిక్షిస్తారు. ఎప్పుడైనా ఈ నేతలు వారికి కనిపించినప్పుడు మహిళల రిజర్వేషన్ ఆశలను నాశనం చేసినవారు వీరేనని.. పార్లమెంటులో ఆనందంతో బల్లలు చరిచారని గుర్తు చేసుకుంటారు’’ అని మోదీ పేర్కొన్నారు.
రాష్ట్రమైనా, పెద్ద రాష్ట్రమైనా సరే.. ప్రతి రాష్ట్రానికి 50శాతం పార్లమెంటు సీట్లను ఇవ్వడానికి సిద్ధమయ్యామని మోదీ చెప్పారు. ‘‘మహిళా బిల్లు, డీలిమిటేషన్‌కు సంబంధించి గొప్పతనాన్ని కూడా ప్రతిపక్షానికి ఇవ్వడానికి సిద్ధమని చెప్పాం. అయినా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మొత్తం దేశం చూస్తుండగానే.. మా నిజాయతీ ప్రయత్నాన్ని భ్రూణ హత్య చేశాయి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
లోక్‌భలో మహిళా బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండింతుల మెజారిటీ లేనంత మాత్రాన బీజేపీ ఓడిపోయినట్టు కాదని మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మహిళల మద్దతు తమకు ఉందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఉన్న ప్రతి అడ్డంకిని తొలగిస్తామని దేశంలోని మహిళలందరికీ హామీ ఇస్తున్నట్టు తెలిపారు.
య చెప్పారు. సంస్కరణలను కాంగ్రెస్ వ్యతిరేకించడమే దానికి కారణమన్నారు. ‘‘కాంగ్రెస్ సంస్కరణల వ్యతిరేక పార్టీ. ఆలస్యం చేయడం, తప్పుదారి పట్టించడం, అడ్డుకోవడం కాంగ్రెస్ మూల సూత్రం. దేశ సరిహద్దు వివాదాలను పెండింగ్‌లో పెట్టింది. పాకిస్థాన్‌తో నీటి పంపకం అంశాలను ఆలస్యం చేసింది. ఓబీసీ రిజర్వేషన్లపై నిర్ణయాన్ని 40 ఏళ్లు పెండింగ్‌లో పెట్టింది. జమిలి ఎన్నికలకు వ్యతిరేకం, అక్రమ వలసదారులను పంపేయడానికి వ్యతిరేకం, సీఏఏకు, సర్ ప్రక్రియకు వ్యతిరేకం. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలన్నీ కాంగ్రెస్ తీరుతో ఏర్పడినవే.’’ అని విమర్శించారు.
ఈ మొత్తం ప్రసంగం ద్వారా ప్రధాని మోదీ తమ తప్పులేమీ లేవని, బిల్లు పాస్ కావడానికి చేయాల్సిందంతా తాము చేసేశామని, ప్రతిపక్షాల కారణంగానే వీగిపోయిందని చెప్పినట్లైంది. అంతేకాకుండా మహిళల ఎప్పుడైతే బిల్లు వీగిపోయిందని వేళ్లు తమ వైపు చూపించకుండా ఈ ప్రసంగం ద్వారా మోదీ జాగ్రత్తపడ్డట్లు అయ్యిందని మరి కొందరి అభిప్రాయం.








