PM Modi: ‘మా నాన్నకు కొంచెం చెప్పండి’.. స్పందించిన ప్రధాని మోదీ!
సోషల్ మీడియాలో ఒక కొడుకు తన తండ్రి ఆరోగ్యంపై ఉన్న ప్రేమతో చేసిన విన్నపం ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Modi) చేరింది. అంతేకాకుండా ఆ యువకుడి అభ్యర్థన మేరకు ప్రధాని స్వయంగా స్పందించడం ఇప్పుడు నెట్టింట తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అసలేం జరిగిందంటే..
యువరాజ్ దువా అనే కంటెంట్ క్రియేటర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన రీల్ (Reel) పోస్ట్ చేశాడు. అందులో తన తండ్రికి చక్కెర (Sugar) తినే అలవాటు ఎక్కువగా ఉందని, ఆయనకు ఆ అలవాటు మాన్పించాలని నేరుగా ప్రధాని మోదీని (PM Modi) కోరాడు. “మన దేశంలో తండ్రీకొడుకుల మధ్య ప్రేమ వ్యక్తపరచడం తక్కువే. మా నాన్న లాంటి వారికి స్నేహితులు మూడో స్థానంలో, కుటుంబం రెండో స్థానంలో ఉంటే.. ప్రధాని మోదీ గారు మాత్రం మొదటి స్థానంలో ఉంటారు” అని యువరాజ్ ఆ వీడియోలో చెప్పాడు. తన తండ్రి ప్రధానికి వీరాభిమాని అని, మోదీ (PM Modi) గారు ఏది చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తారని చెప్పాడు. అందుకే మోదీ స్వయంగా చెబితే తన తండ్రి తీపి తినడం తగ్గించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటారని ఆ వీడియోలో అభ్యర్థించాడు.
ఇవి కూడా చదవండి
మోదీ ఇచ్చిన హెల్త్ రిప్లై..
యువరాజ్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతూ ప్రధాని మోదీ (PM Modi) దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన అనూహ్య రీతిలో స్పందించారు. ఆ యువకుడి రీల్‌ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ.. యువరాజ్ తండ్రితో పాటు దేశ ప్రజలందరికీ ఒక మంచి ఆరోగ్య సూచన చేశారు. “యువరాజ్ అభ్యర్థన మేరకు.. అతడి తండ్రిని, అలాగే మీ అందరినీ కోరుతున్నాను. దయచేసి చక్కెర వినియోగాన్ని తగ్గించండి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి” అని ప్రధాని పేర్కొన్నారు. మోతాదుకు మించి చక్కెర తీసుకోవడం వల్ల ఊబకాయం (Obesity) ముప్పుతో పాటు అనేక రోగాల బారిన పడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ‘యోగా’ను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
తన వీడియోకు ప్రధాని (PM Modi) నుంచి నేరుగా స్పందన రావడంతో యువరాజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన మాట ప్రధాని వరకు వెళుతుందని తాను అస్సలు ఊహించలేదని అతను ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి








