నోటీసు తిరస్కరించినా.. సీఈసీపై మళ్లీ నోటీసులిచ్చిన ప్రతిపక్షాలు
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు మరోసారి రాజ్యసభలో నోటీసు సమర్పించాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో సీఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో శుక్రవారం రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు తాజా నోటీసు అందజేశాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 18న ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం పట్టించుకోలేదని విపక్షాలు ఈ నోటీసులో తీవ్రంగా ఆక్షేపించాయి.
11 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 73 మంది ఎంపీల సంతకాలతో వున్న నోటీసును రాజ్యసభ సెక్రెటరీ జనరల్ కి అందజేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) తో పాటు ఆర్టికల్ 124(4) ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం 2023 లోని సెక్షన్ 11(2), న్యాయమూర్తుల (విచారణ) చట్టం 1968 కింద దుష్ప్రవర్తన కారణంగా జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని అందులో డిమాండ్ చేశారు.
సీఈసీపై విపక్షాలు కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా, ఏడు ప్రధానాంశాలతో కూడిన చార్జిషీట్‌ను సిద్ధం చేశాయి. ముఖ్యంగా అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల మోసంపై విచారణను అడ్డుకుంటున్నారని, ఓటర్ల జాబితా నుంచి భారీగా పేర్ల తొలగింపు (సామూహిక ఓటు హక్కు రద్దు) వంటి తీవ్రమైన విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కేంద్రానికి లబ్ధి చేకూర్చేలా ఉందంటూ మమతా బెనర్జీ వంటి నేతలు చేసిన ఫిర్యాదులు ఈ నోటీసు వెనుక ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించడం అంత సామాన్యమైన విషయం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎలాగైతే అభిశంసిస్తారో, అదే కఠినమైన ప్రక్రియ ఇక్కడ కూడా అమలు చేయాలి. ఒకవేళ ఈ నోటీసును సభ ఆమోదిస్తే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా సీజేఐ నేతృత్వంలో ఒక హైలెవల్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఒక కోర్టు విచారణ లాగే సాక్షులను విచారించడం, నిందితుడిని క్రాస్ ఎగ్జామిన్ చేయడం వంటివి జరుగుతాయి.
సీఈసీపై విపక్షాలు కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా ఏడు ప్రధానమైన అంశాలతో కూడిన ఛార్జిషీట్ ను సిద్ధం చేశాయి. ముఖ్యంగా అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల మోసంపై విచారణను అడ్డుకుంటున్నారని, ఓటర్ల జాబితా నుంచి భారీగా పేర్ల తొలగింపు వంటి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. బెంగాల్ వంటి రాష్ట్రాలలో సర్ ప్రక్రియ కేంద్రానికి లబ్ధి చేకూర్చేలా వుందని కూడా ఆరోపిస్తున్నారు.
మూడు వారాల క్రితమే…
ప్రధాన ఎన్నికల కమిషనర్ ను తొలగించాలని సరిగ్గా మూడు వారాల క్రితం కూడా విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు నోటీసును ఇవ్వగా.. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తిరస్కరించారు. ఈ విషయాన్ని రాజ్యసభ సచివాలయం ప్రకటించింది. అలాగే లోకసభలోనూ ఈ నోటీసు తిరస్కరణకు గురైంది.అభిశంసన నోటీసును లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా కూడా తిరస్కరించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ ను తొలగించడం అంత సామాన్యమైన విషయమేమీ కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 (5) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎలాగైతే అభిశంసిస్తారో, అదే ప్రక్రియను ఇక్కడ కూడా అమలు చేయాలి. ఒకవేళ ఈ నోటీసును సభ ఆమోదిస్తే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా సీజేఐ నేతృత్వంలోఒక హైలెవల్ కమిటీని ఏర్పాటు చేస్తారు. కోర్టులో సాక్షులను విచారించడం, క్రాస్ ఎగ్జామినేషన్ ఎలాగైతే వుంటుందో అలాంటివి ఇక్కడ కూడా జరుగుతాయి.








