భోజ్‌శాల కాంప్లెక్స్ సరస్వతీ ఆలయయే : హైకోర్టు తీర్పు
మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజ్‌శాల/కమల్ మౌలా కట్టడం సరస్వతి దేవి ఆలయమేనని ఆ రాష్ట్ర హైకోర్టు తేల్చింది. ముస్లింలు వాదిస్తున్నట్టు అక్కడ మొదటి నుంచీ మసీదు లేదని వెల్లడించింది. సరస్వతి ఆలయ శిథిలాలతోనే ప్రస్తుత కట్టడాన్ని నిర్మించారని స్పష్టంచేసింది. భోజ్‌శాలలో హిందువులు, ముస్లింలు వేర్వేరు వారాల్లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ 2003 ఏప్రిల్ 7న భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ) ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. భోజ్‌శాలలో హిందువులకు సంపూర్ణ ప్రార్థనా హక్కులను కల్పిస్తూ ఇండోర్ ధర్మాసనం శుక్రవారం తీర్పును వెలువరించింది. మసీదు కోసం వేరే స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరే వెసులుబాటును ముస్లిం సంస్థలకు కల్పించింది.
భోజ్ శాల వివాదం కొన్ని దశాబ్దాలుగా నడుస్తూనే వుంది. ఇక్కడి కట్టడాన్ని హిందువులు సరస్వతీ దేవి ఆలయంగా, ముస్లింలు కమల్ మౌలా మసీదుగా పరిగణిస్తున్నారు. 2023 నాటి ఏఎస్ఐ ఒప్పందం ప్రకారం హిందువులు మంగళవారాల్లో, ముస్లింలు శుక్రవారాల్లో ఇక్కడ ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. హిందువుల ప్రకారం ఈ ఒప్పందాన్ని హైకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఆదేవంతో 2024 లో ఏఎస్ఐ సర్వే చేసి నివేదిక సమర్పించింది. దీనిపైనే తాజాగా న్యాయస్థానం తీర్పును వెలువరించింది.







