లోకసభలో పెరగనున్న స్థానాలు.. ఇకపై 850 స్థానాలని ప్రచారం
మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16 న పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే.. లోక్సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి 850కి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వివిధ రాష్ట్రాల లోక్సభ సీట్లను 815కు, కేంద్ర పాలిత ప్రాంతాల సీట్లను 35కు పెంచబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 543 నుంచి 850కి చేరొచ్చని సమాచారం.
మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుల ప్రతులను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇప్పటికే ఎంపీలకు సమాచారం ఇచ్చింది. ఆ ప్రతులను కూడా పంపింది. అయితే.. లోకసభలో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, సీట్ల పెంపు కార్యక్రమం పూర్తిచేసి, 2029 ఎన్నికల్లో అమలు చేస్తారని అంటున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2029 ఎన్నికల్లో 850 ఎంపీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతాయి. కాగా, అన్ని రాష్ట్రాలకు సగటున లోక్సభ, అసెంబ్లీ సీట్లను 50 శాతం పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి








