ఆ పదవి నన్ను వదిలి పెట్టడం లేదు
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైపూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలని నా మనసులో ఉంది. కానీ ఆ పదవి నన్ను వదిలి పెట్టడం లేదు. ప్రతి మాట ఆలోచించిన తర్వాతే మాట్లాడుతున్నాను. సీఎం పదవిని వదిలేస్తానని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. అయితే ఈ విషయంలో పార్టీ కేంద్ర అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని అన్నారు. సోనియా గాంధీ తనను మూడు సార్లు ముఖ్యమంత్రిని చేశారని తెలిపారు. ఇది సామాన్యమైన విషయం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే విజన్ 2030ని అమలు చేస్తామన్నారు. తాను ప్రవేశపెట్టిన సంస్కరణల వల్లే రాజస్థాన్ బలమైన రాష్ట్రంగా ఎదిగిందన్నారు.













