Google: వీసా కష్టాలకు గూగుల్ చెక్.. బెంగళూరులో భారీ క్యాంపస్!
అమెరికాలో హెచ్-1బీ (H-1B) వీసా నిబంధనలు కఠినతరం కావడంతో టెక్ దిగ్గజం గూగుల్ (Google) కీలక నిర్ణయం తీసుకుంది. వీసా చిక్కులు, ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూడకుండా భారత్‌లోనే తమ కార్యకలాపాలను భారీగా విస్తరించాలని నిర్ణయించింది. ఇందుకోసం బెంగళూరు కేంద్రంగా భారీ ప్రణాళికలు రచిస్తోంది.
బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం.. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ఏకంగా 20,000 మంది ఉద్యోగులకు సరిపోయేలా గూగుల్ (Google) అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఒక ఆఫీసును లీజుకు తీసుకోగా, మరో రెండు టవర్ల కోసం చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం భారత్‌లో 14 వేల మంది గూగుల్ ఉద్యోగులు ఉండగా, కొత్త క్యాంపస్ రాకతో ఈ సంఖ్య రెట్టింపు కానుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ట్రంప్ ప్రభుత్వ హయాంలో వలస నిబంధనలు కఠినం కావడం, హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు వల్ల నిపుణులను అమెరికాకు తీసుకెళ్లడం కంపెనీలకు తలకు మించిన భారంగా మారింది. ఈ సమస్యను అధిగమించడంతో పాటు, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగానికి భారత్ కేంద్రంగా మారుతుండటంతో భారత్‌లో విస్తరణకే గూగుల్ (Google) మొగ్గు చూపుతోంది.






