ప్రధాని మోదీ సూచించిన ‘‘డిజిటల్ ఉపవాసం’’ అంటే..?
ఉపవాసం అన్న పదం చాలా సార్లు విని వుంటాం. మనమందరమూ చేస్తూనే వుంటాం. ఎవరికి నచ్చిన దేవుడి కోసం ఆ రోజు అందరూ ఉపవాసాలు చేస్తుంటారు. అయితే.. తాజాగా కొత్త ఉపవాసం తెరపైకి వచ్చింది. అది కూడా ప్రధాని నరేంద్ర మోదీ తెచ్చిన ఉపవాసం. దాని పేరు ‘‘డిజిటల్ ఉపవాసం’’. చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ భక్తులను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. అందులో ఈ ‘‘డిజిటల్ ఉపవాసం’’ ప్రస్తావన వుంది.
ఇవి కూడా చదవండి
డిజిటల్ ఉపవాసం అంటే చార్ ధామ్ యాత్రలో వున్న భక్తులు తమ ప్రయాణంలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వంటి వారికి పూర్తిగా దూరంగా వుండి డిజిటల్ ఉపవాసం పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే డిజిటల్ ఉపవాసం చేస్తూ, ఉత్తరాఖండ్ ప్రకృతి అందాలను ఆస్వాదించాలని, దైవ నామ స్మరణ చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు. అలాగే పుణ్య క్షేత్రాల వద్ద పరిశుభ్రంగా వుంచాలని, సింగిల్ యూజ్ ప్టాస్టిక్ కు దూరంగా వుండాలని కూడా సూచించారు. అలాగే బడ్జెట్ లో కనీసం 5 శాతం డబ్బుతో స్థానిక ఉత్పత్తుల కొనుగోలు, ప్రయాణ నియమ నిబంధనలు పాటించాలని కూడా మోదీ సూచించారు.
ఈ నెల 19 వ తేదీన గంగోత్రి, యమునోత్రి ద్వారాలు తెరుచుకున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అన్ని ప్రాంతాల నుంచీ భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతాలు ఓ మినీ ఇండియాగా అయ్యింది. ఇక.. బుధవారం రోజున కేదార్ నాథ్ ఆలయ దర్శనాలు ప్రారంభమయ్యాయి. 15 క్వింటాళ్ల పూలతో కేదార్ నాథ్ ఆలయాన్ని హర హర మహాదేవ్ అంటూ తెరిచారు. గంగోత్రిలో జరిగిన పూజకు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచ్చేశారు. క్లీన్ అండ్ గ్రీన్ యాత్రకు భక్తులు సహకరించాలని ఆయన కోరారు. కాగా, తొలిసారిగా బద్రినాథ్, కేదార్నాథ్ గంగోత్రి పుణ్యక్షేత్రాలకు హిందూయేతరుల ప్రవేశంపై ఆంక్షలు నిషేధించారు.
యాత్రికుల రద్దీని నియంత్రించడానికి, భద్రతను పర్యవేక్షించడానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు నిబంధన వెల్లడించారు. ఉత్తరాఖండ్ టూరిజం అధికారిక వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా భక్తులు ముందుగానే పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. హరిద్వార్ తో పాటు రిషికేశ్, డెహ్రాడూన్ లో కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటయ్యాయి. హరిద్వార్ లో 20 కౌంటర్లు 24 గంటలూ పనిచేస్తాయి.
ఇవి కూడా చదవండి








