Indian Commerce: భారత వాణిజ్యాన్ని రక్షించేందుకు కేంద్రం అలర్ట్!
పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలల (ముఖ్యంగా ఇరాన్ సంక్షోభం) ప్రభావం భారత వాణిజ్యంపై (Indian Commerce) పడకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు అప్రమత్తత చర్యలు చేపట్టింది. దేశీయ ఎగుమతులు, దిగుమతులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అత్యున్నత స్థాయి ‘ఇంటర్-మినిస్టీరియల్ ప్యానెల్’ (అంతర్ మంత్రిత్వ శాఖల కమిటీ)ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) మంగళవారం అధికారికంగా ప్రకటించారు.
ఎప్పటికప్పుడు పర్యవేక్షణ..
వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వాటి వల్ల భారత వాణిజ్యంపై (Indian Commerce) పడే ప్రతికూల ప్రభావాలను అంచనా వేయడానికి రవాణా, వాణిజ్య భాగస్వాములతో వరుసగా రెండో రోజు కూడా కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించి, తక్షణ చర్యలు సూచించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ప్యానెల్లో పలు కీలక శాఖల ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించారు. అవే..
ఆర్థిక సేవల విభాగం (DFS)
కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)
నౌకాయాన, పోర్టులు, జలమార్గాల శాఖ
పెట్రోలియం, సహజ వాయువుల శాఖ
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC)
వేగవంతమైన క్లియరెన్స్‌లు..
యుద్ధ భయాలతో అంతర్జాతీయ సరుకు రవాణా (ఎగుమతులు, దిగుమతులు) నిలిచిపోకుండా చూసేందుకు, నిబంధనల్లో అవసరమైన సడలింపులు ఇవ్వడానికి ప్రభుత్వం (Indian Commerce) పూర్తిగా సిద్ధంగా ఉందని మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. కస్టమ్స్, పోర్టు అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, సరుకుల క్లియరెన్సులు అత్యంత వేగంగా, ఆటంకాల్లేకుండా పూర్తయ్యేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడే ఒడిదుడుకుల నుంచి భారతీయ ఎగుమతిదారుల ప్రయోజనాలను రక్షించేందుకు.. దేశీయ ఆర్థిక, బీమా సంస్థలతో కూడా ప్రభుత్వం ముమ్మరంగా చర్చలు జరుపుతోందని ఆయన వ్యాపార వర్గాలకు గట్టి భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి







